
వెల్జీపూర్ లో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
*ఇల్లంతకుంట //మన ప్రజావాణి*
పోచమ్మ తల్లి బోనాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెల్జిపూర్ గ్రామ దేవత పోచమ్మ గుడి ఆలయం వద్దకు మహిళలు బోనాలతో ఊరేగింపుగా పూజారుల ఆధ్వర్యంలో డప్పుచప్పుళ్లతో ఇంటి ఆడపడులందరు సామూహికంగా బోనాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు.శివసత్తుల పూనకాలు, అలరించాయి. ఉదయం నుంచే గ్రామ దేవత పోచమ్మ గుడి ఆలయం వద్దకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారుదేవాలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.పాడి పంటలతో గ్రామస్తులు సంతోషంగా ఉండాలని దేవతలను పూజిస్తారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు..