
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలను పీడిస్తున్న లంచగొండి అధికారులు
పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు ఉపాధ్యాయుడి వద్ద రూ.20 వేలు డిమాండ్ చేసిన ములుగు జిల్లా డీఈవో జీ. పాణిని మరియు జూనియర్ అసిస్టెంట్ టీ.దిలీప్ కుమార్
లంచం ఇవ్వకపోతే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వమంటూ బెదిరించడంతో, ఆగ్రహంతో ఏసీబీకి ఫిర్యాదు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన ఉపాధ్యాయుడు
సంగారెడ్డి జిల్లా కొహీర్ మండలానికి చెందిన ఒక వ్యక్తి వాటర్ సర్వీసింగ్ సెంటర్ నిర్మాణం కోసం అనుమతి కోరగా, రూ.12 వేలు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి
బాధితుడి ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు