
మేడిపల్లి ప్రెస్ క్లబ్ కోఆర్డినేటర్ గా రావు నాగిరెడ్డి
– ప్రెస్ క్లబ్ ఆవరణలో మేడిపల్లి ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ పూర్తిస్థాయి కమిటీ నియామకం
పీర్జాదిగూడ, రాజముద్ర న్యూస్: మేడిపల్లి ప్రెస్ క్లబ్ నియమ నిబంధనలకు లోబడి సంఘాన్ని సంఘటితం చేస్తూ జర్నలిస్టుల సంక్షేమం కొరకు అహర్నిశలు కృషి చేస్తానని మేడిపల్లి ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కోఆర్డినేటర్ గా నూతనంగా ఎన్నికైన రావు నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రెస్ క్లబ్ ఆవరణలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రెస్ క్లబ్ పూర్తిస్థాయి కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ రావు నాగిరెడ్డి మాట్లాడుతూ… జర్నలిస్టుల సంక్షేమం, జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం కొరకు కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా మేడిపల్లి ప్రెస్ క్లబ్ ఔన్నత్యాన్ని కాపాడుతూ ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల అభివృద్ధి, ఆరోగ్య భద్రత వంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. కోఆర్డినేటర్ గా ఎన్నుకున్నందుకు ప్రెస్ క్లబ్ పెద్దలకు, సహచర జర్నలిస్టు మిత్రులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.