
స్కూల్ బస్సు కింద నలిగిపోయిన చిన్నారి
మహదేవపూర్, (భూపాలపల్లి) జూలై 29 (మన ప్రజావాణి): తను చదువుతున్న పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో జరిగింది. ఉదయం 8 గంటలకు సూరారం ఎస్వీఎస్ పాఠశాలకు చెందిన బస్సు అంబడిపెళ్లికి రాగా తాను ఎక్కడానికి వచ్చిన చిన్నారి బస్సు క్రిందపడి మృతి చెందింది. తమ కండ్ల ముందు సంఘటన జరగడంతో కన్నీరు మున్నూరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు. డ్రైవర్ నిర్లక్ష్య కారణంగానే పాప చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.