
పెద్దపల్లి, జూన్ 26( మన ప్రజావాణి) : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రోడ్డు రవాణా సంస్థ అధికారి(ఆర్టీవో) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. వినియోగదాల నుంచి ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఆర్టీవో అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని సమాచారంతో గురువారం ఒక్కసారిగా కార్యాలయంపై అటాక్ చేశారు.
ఈ సందర్భంగా ఆర్టీవో కార్యాలయ ఏజెంట్ లుగా వ్యవహరిస్తున్న ఏజెంట్ల సంఘం అధ్యక్షుడితో పాటుగా ఓ అధికారికి సంబంధించిన ఇద్దరు డ్రైవర్లు, ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఏ పనికి ఎంత తీసుకుంటున్నారు? అధికారులకు ఎంత ఇస్తున్నారు? అనే పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది.