
యూత్ సమావేశం లో మాట్లాడుతున్న యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్…
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి సెప్టెంబర్ 22
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యూత్ కమిటీ సమావేశాన్ని సోమవారం రోజున ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్ మాట్లాడుతూ మన మండలంలోని ప్రతి గ్రామంలో గ్రామ ఒక యూత్ అధ్యక్షుని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే ప్రతి గడపగడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరంలోపే చేసిన సంక్షేమ పథకాల గురించి అవగాహన ప్రజలకు కల్పించాలని ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. యూత్ సభ్యులు కలిసికట్టుగా ఉంటే రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, దిలీప్ పటేల్, మనోహర్ పటేల్, బాలాజీ పటేల్, గంగు నాయక్, విజయ్ పటేల్, రాహుల్, శ్రీనివాస్, బాబురావు పటేల్, విజయ్ కుమార్ సెట్, జైపాల్ రెడ్డి, సురేష్ గొండ, కృష్ణమౌళి, సాయినాథ్, రాము గొండ, సచిన్, తదితరులు పాల్గొన్నారు.