కెనడా ఇంటెలీజెన్స్ అధికారులే క్రిమినల్స్ : కెనడా ప్రధాని ట్రూడో

Ramesh

Ramesh

District Chief Reporter

కెనడా(Canada) ప్రభుత్వ ఇంటెలీజెన్స్ అధికారులపై సాక్షాత్తూ ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో(Trudeau) ఫైర్ అయ్యారు. ‘‘కెనడాలో జరిగిన హింసాత్మక ఘటనలతో భారత(India) ప్రధానమంత్రి నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌లకు ముడిపెడుతూ తప్పుడు ప్రచారం చేసిన ఇంటెలీజెన్స్ అధికారులే క్రిమినల్స్’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడాలోని బ్రాంప్టన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ ఆ క్రిమినల్స్ (కెనడా ఇంటెలీజెన్స్ అధికారులు) టాప్ సీక్రెట్ సమాచారాన్ని మీడియాకు లీక్ చేస్తున్నారు. అయితే వాళ్లు లీక్ చేస్తున్నదంతా తప్పుడు సమాచారమే. దానితో మీడియా అడ్డదిడ్డంగా కథనాలు వండి వారుస్తోంది. మీడియా అలా చేయడం ముమ్మాటికీ తప్పే’’ అని ఆయన విమర్శించారు.

ఇటీవలే ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ అనే కెనడా వార్తాపత్రికలో ఒక సంచలన కథనం ప్రచురితమైంది. కెనడా నిఘా వర్గాల సమాచారం అని పేర్కొంటూ పబ్లిష్ చేసిన ఆ కథనంలో.. ‘‘కెనడాలో జరిగిన పలు హింసాత్మక ఘటనల సమాచారం ముందే భారత ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్, ఎన్ఎస్‌ఏ అజిత్ దోవల్‌లకు తెలుసు’’ అని ప్రస్తావించారు. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పందించిన కెనడా విదేశాంగ శాఖ.. ఆ వార్తలో ప్రస్తావించిన అంశాలన్నీ తప్పులే అని వెల్లడించింది. కెనడా ఇంటెలీజెన్స్ విభాగాలకు అలాంటి సమాచారమేదీ అందలేదని స్పష్టం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్