
శ్రీ సరస్వతీ శుభోదయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ తంగళ్ళపల్లి లో ఈరోజు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ ఎం శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ ఇది హిందువుల శ్రావణ మాసంలో జరుపుకునే పండుగ అన్నా చెల్లెల మధ్య బలంగా ఆత్మీయ సమ్మేళనాన్ని బలపరుస్తుంది అక్క తమ్ముడి మధ్య రక్షణ మరియు ప్రేమ బంధాన్ని బలపరుస్తుంది. చెల్లె అన్నకు మనికట్టుకు రాఖీ కడుతూ నేను నీకు రక్ష నీవు నాకు రక్షా మనిద్దరం దేశానికి రక్షా అని చెబుతూ తన అన్నకు దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటుంది అని పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి లతారెడ్డి ప్రీ ప్రైమరీ ఇన్చార్జి పద్మశ్రీ మమత అనిల్ హరికృష్ణ వనిత సరిత వాణి సౌజన్య కీర్తన శ్యామల పీటి అజయ్ కుమార్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు