
సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్ మాల్.. మాజీ
ఎమ్మెల్యే పీఏ, అనుచరుల చేతివాటం..
సూర్యాపేట జిల్లా కోదాడ, ఆగస్టు 11/ మన ప్రజావాణి.
కోదాడ
నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కాం
వెలుగు చూసింది. గత
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హయాంలో ఆయన
పీఏగా చెప్పుకున్న ఒక వ్యక్తితో పాటు మరికొందరు
బీఆర్ఎస్ నాయకులు దీంట్లో ఉన్నట్లు సమాచారం.
అసలు లబ్ధిదారులైన సుమారు 50 మందికి చెక్కులు
ఇవ్వకుండా వారి పేర్లు, ఇంటి పేర్లతో సరిపోయే వేరే
వ్యక్తులకు అందజేసి ఆ మొత్తాన్ని తమ ఖాతాలో
వేసుకున్నట్టు తెలుస్తోంది.ఈ వ్యవహారంలో సెక్రెటేరియట్‌కు చెందిన ఒక ఉద్యోగి
ప్రమేయం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. చెక్కులు రాని
వారు ఇటీవల ప్రస్తుత ఎమ్మెల్యే పద్మావతికి ఫిర్యాదు
చేయడంతో చెక్కుల గోల్మాల్ విషయం బయటపడింది.
అయితే దీనిపై ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా
విచారణ ప్రారంభించారని సమాచారం. ఈ క్రమంలోనే
సెక్రటేరియట్ ఉద్యోగితోపాటు నకిలీ ధ్రువపత్రాలు
సృష్టించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు
తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏ పరారీలో
ఉన్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది.