
విధులకు హాజరుకాని ఆర్ బి ఎస్ కే వైద్యాధికారి..?
హాజరు మాత్రం యధావిధిగా
పలు విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్ బి ఎస్ కె ఉద్యోగులు వైద్యులు
మన ప్రజావాణి (ఖమ్మం ప్రతినిధి)
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్ బి ఎస్ కే పథకం కింద పనిచేసే సిబ్బంది వైద్యాధికారులు విధులకు ఎగనామం పెట్టి పాత చిత్రాలను అప్లోడ్ చేసి దర్జాగా హాజరు పొందుతున్న వ్యవహారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలోని రూరల్ మండలం ఏదులాపురం మున్సిపల్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆర్ బి ఎస్ కే ఒక మహిళా వైద్యురాలు ఏఎన్ఎం ఫార్మసిస్టు మాత్రమే ఈనెల 7వ తేదీన విధులకు హాజరైనప్పటికీ మండల వైద్యాధికారి రవీంద్రనాథ్ విధులకు హాజరు కాకుండా కనీసం కలెక్టరేట్లో పేస్ అటెండెన్స్ సంతకం లేకుండా పాత ఫోటోలను అప్లోడ్ చేసి హాజరు నమోదు చేయించుకున్నట్లు మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి వీరభద్రం సమాచారం సేకరించి వివరణ కోరగా కలిస్తే డీటెయిల్స్ అన్ని చెప్తానని హాజరు కాని విషయంపై సమాధానం నిరాకరించారు. ప్రధానంగా ఖమ్మం రూరల్ మండలంలో ఫార్మాసిస్టులు వైపాల్పడుతున్నట్లు ఏఎన్ఎంలు సైతం విధులకు నామం పెడుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరి కొన్ని వివరాలతో రేపటి కథనంలో వేచి చూడండి..!