
శుభోదయం గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తంగళ్ళపల్లి మరియు సిరిసిల్లలో ఈరోజు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయదినోత్సవం జరుపుకోవడం జరిగింది మనిషి జీవితంలో తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయుడు సమాజానికి దిశా నిర్దేశాన్ని చెప్పడం జరుగుతుంది గురువు ఇచ్చే బోధన మనలో జ్ఞానాన్ని కాకుండా మానవతా విలువల్ని నైతిక విలువలను కూడా పెంపొందించడం జరుగుతుంది గురువును గౌరవించినట్టుగా ఈ భూమి మీద మరెవరిని గౌరవించరు అని పూర్వీకులు చెప్పడం జరిగింది పెద్దలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధి దేవోభవ అని గురువును దేవునితో సమానము చెప్పడం జరిగింది తల్లిదండ్రి మనకు జన్మనిస్తే ఉపాధ్యాయుడు చీకటిని పారద్రౌలి వెలుగును నింపుతాడు అని చెప్పడం జరిగింది ఈరోజు పాఠశాలలో కేక్ కట్ చేసి పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుని శాలువాతో సన్మానించడం జరిగిందిఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ యాదవ్ ప్రిన్సిపాల్ మాధవి లతారెడ్డి ప్రీ ప్రైమరీ ఇన్చార్జి పద్మశ్రీ సిరిసిల్ల బ్రాంచ్ ఇన్చార్జి లావణ్య అండ్ అకాడమిక్ ఇన్చార్జి సాయిప్రియ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు