
సమస్యలతో సతమతమవుతున్న మేడేపల్లి
పైగా ఆదర్శ గ్రామ మట…
గ్రామపంచాయతీ కార్యాలయానికి చెత్త తరలింపు నిరసన
మేడేపల్లి లో గత రెండు నెలలుగా చెత్త సేకరణ లేక ఆగ మాగం..?
ముదిగొండ మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని మేడేపల్లి లో పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గత రెండు నెలల నుండి గ్రామంలోని చెత్త విపరీతంగా పెరిగిపోయిందని పారిశుద్ధ్య పనులు చేయకపోవడం వలన దోమలు పెరిగి కుట్టడం వలన జ్వరాల భారీన పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ సభలో భాగంగా నేడు నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న మేడేపల్లి గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా గ్రామంలోని చెత్తను తీసుకొచ్చి గ్రామపంచాయతీ కార్యాలయంలో పోశారు. ముదిగొండ మండలంలో ఒక్క మేడేపల్లి తప్ప అన్ని గ్రామాలలో మంచినీటి పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి నిర్వాకం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లాస్థాయి పంచాయతీ అధికారులు స్పందించి పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.