
రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..!
రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..?
సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం
*అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.?
ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది..?
*బాధితుల ఆరోపణలు ఆధారాలతో మన ప్రజావాణి వరుస కథనాలు మీకోసం…!
*వేములవాడ రాజన్న సాక్షిగా అక్రమాలకు అధికారులు చెక్ పెడతా రా..?
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పోలీస్ యంత్రంగం.. చొరవ తీసుకోవాలని బాధితులు… కోరుకుంటున్నారు…
స్టేట్ బ్యూరో మన ప్రజావాణి
*అధిక వడ్డీలు. అమాయకుల భూములను తాకట్టు పెట్టుకొని కొన్నిచోట్ల బంగారం నగలు పుస్తెలను అడ్డగోలుగా స్వాధీనం చేసుకుంటూ బడుగు జీవుల ప్రతాపం చూపుతున్న వడ్డీ వ్యాపారులపై మన ప్రజావాణి సమగ్ర సంచలన కథనం
ఎంత ఆపదైతే మాత్రం భూములు తనకా చేసుకోని అధిక వడ్డీలకు దందా లు చేస్తారా…?
కొన్నిచోట్ల భూములు తనకా రిజిస్ట్రేషన్ చేసుకుని మరికొన్ని చోట్ల బంగారం పుస్తెలతాడులు తనకా చేసుకోని పేద మధ్యతరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతుందని విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. పేరుకు నామమాత్రం వడ్డీ అని చెప్పేసి అప్పులు ఇచ్చి భూములు బంగారం తనఖా పట్టించుకోని పేద మధ్యతరగతి కుటుంబాలను చిన్న బిన్నం చేస్తున్న వ్యవహారం అది కూడా జిల్లా కేంద్రంగా జరగడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఆర్.బి.ఐ నిబంధన ప్రకారం వ్యాపారం చేస్తున్నారా చేయటం లేదా అనేది ప్రభుత్వ యంత్రాంగాలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీంట్లో కొన్ని శాఖల అధికారులు జోక్యం చేసుకొని సెటిల్మెంట్లు చేస్తున్నట్లు దీంతో పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన బడుగు జీవులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మాక్రోఫైనాన్స్ మాయలో పడి ఎంతోమంది ప్రజలు అధిక వడ్డీలు చెల్లించలేక తనువులు సారిం చి నవేళ నేటి ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈ దుస్థితిపై బాధితులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా లేకుండా వదిలేస్తారా అనేది భవిష్యత్తులో తేలనున్నది
ఈ వ్యవహారంపై బాధితుల వద్ద ఉన్న డాక్యుమెంట్లు అగ్రిమెంట్లు లాంటి పూర్తి ఆధారాలతో.. మన ప్రజావాణి రెండో కథనంలో వేచి చూడండి….!