
మన ప్రజావాణి ప్రతినిధి పై మిడిసిపడ్డ దోబి కాంట్రాక్టర్..!
పాలమూరు అడ్డాలో నుండి.. ఖమ్మంలో ప్రతినిధిపై వీరంగమేస్తున్న
వైనం..!!
ఖమ్మం జిల్లా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో లాండ్రీ వ్యవహారంలో జరిగిన వ్యవహారంపై మన ప్రజావాణి సంచలన కథనాన్ని అందించిన సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ నేపథ్యంలోలాండ్రి వ్యవహారంలో సదరు కాంట్రాక్టర్ వివరణ కోరితే.. ప్రభుత్వ దవాఖానలో మంచినీళ్లు ఉన్నాయా.. మీకు ఎవరు ఇచ్చారు..? మీరెవరు అడగటానికి.. నీకేం హక్కు ఉన్నది.. అంతా నా ఇష్టం అంటూ ఎస్ఎం అసోసియేట్ కాంట్రాక్టర్ మన ప్రజావాణి స్టేట్ బ్యూరో ప్రతినిధి వీరభద్రంపై వీరంగం వేశారు. నీది ఏ పేపర్ నీకేం అవసరం అంతా నిబంధనల ప్రకారం ఉన్నాయో లేవో అడగటానికి మీరు ఎవరు విద్యుత్ బకాయిలు వసూలు చేయడానికి అధికారులు ఉన్నారు ప్రశ్నించడానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడానికి నీకేం హక్కు ఉంది అంటూ తెగ మిడిచిపడ్డారు.. అక్రిడేషన్ సమయంలో నీ అక్రిడేషన్ సంగతి తేలుస్తా అంటూ రాష్ట్రస్థాయిలో సమాచార పౌర సంబంధాల శాఖలో కూడా పలుకుబడి దండిగా ఉన్నట్లు దౌర్జన్యకాండ కు దిగటం పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నోటీసులు లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్న సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటారా లేక వదిలేస్తారా అంటూ ఖమ్మం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.