
*ఏసీబీ వలలో కోదాడ ఫారెస్ట్ బీట్ అధికారి..*
సూర్యాపేట జిల్లా కోదాడ, ఆగస్టు 20/ మన ప్రజావాణి.
కోదాడ పట్టణంలో బుధవారం ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడులలో కర్ర వ్యాపారం చేసే వ్యాపారి నుండి 20 వేలు లంచం తీసుకుంటూ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనంతుల వెంకన్న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
కోదాడ డివిజన్‌కు చెందిన ఒక వ్యక్తి కర్ర వ్యాపారం చేస్తున్నాడు. అతడు పనికిరాని చెట్లను కొని వాటిని కొట్టి కర్రలుగా మార్చి విక్రయించేవాడు. అందుకు ప్రతీ చెట్టుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ణయించిన మొత్తం చలానాగా చెల్లించాడు. ఇటీవల అతడు కోదాడ సమీపంలోని ఒక గ్రామంలో 120 చెట్లు కొట్టి వాటి కలపను విక్రయించేందుకు రైతుతో ఒప్పందం చేసుకున్నాడు.
ఈ విషయం తెలిసిన రేంజ్ ఆఫీసర్ అనంతుల వెంకన్న, రైతు హరి నాయక్‌ను సంప్రదించి చెట్లు నరకాలంటే 60 వేలు చలానాగా చెల్లించాలని, తనకు 50 వేలు ఇస్తే చెట్లు నరకడమే కాక, వాటిని రవాణా చేసే సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తానని చెప్పాడు. అయితే తాను చలన చెల్లిస్తామని చెప్పినా ఆయన వినకుండా తనకు 50 వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో ఆ వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సూచన మేరకు బుధవారం మధ్యాహ్నం కోదాడ బైపాస్ రోడ్డులో 20 వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ నిబంధనల ప్రకారం వెంకన్నను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎవరైనా ప్రజల నుండి లంచాలు డిమాండ్ చేస్తే తమకు ఫేస్ బుక్ పేజీ, ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ లేదా ఏసీబీ అధికారుల నంబర్లకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.