
మట్టి ప్రతిమల్ని పూజించి పర్యావరణాన్ని కాపాడాలి……..
కోదాడ,ఆగస్టు, 25/ మన ప్రజావాణి.
మట్టి గణపతి మహా గణపతి
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు గరిణే ఉమామహేశ్వరి, శ్రీధర్ పేర్కొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని కోదాడ పట్టణంలో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాత సన్నే శశికుమార్ దంపతుల సహకారంతో 500 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో పర్యావరణం దెబ్బతింటుందని ప్రతి ఒక్కరు పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలను పూజించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి చారుగండ్ల ప్రవీణా రాజశేఖర్, రంగారావు, వెంపటి ప్రసాద్, భార్గవి తదితర పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు..