
ఉచిత రైసు పంపిణీలో పాల్గొన్న బిజెపి మండల అధ్యక్షులు కారం రామన్న దొర.
ప్రజావాణి ప్రతినిధి దేవీపట్నం సెప్టెంబర్ 4
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం మంటూరు గ్రామపంచాయతీ పెనికిలపాడు గ్రామం,
పెద్ద భీంపల్లి -2 R&R కాలనీలో
ఏర్పాటు చేసిన డి ఆర్ డిపో వద్ద ఉచిత రైసు పంపిణీ లో
పాల్గొన్న బిజెపి మండల అధ్యక్షులు కారం రామన్న దొర
ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు మాట్లాడుతూ,
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలో 81 కోట్లకు పైగా, రాష్ట్రంలో 2.68 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఉచిత బియ్యం అందుతున్నాయి అని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిఆర్ డిపో సేల్స్ మేన్ ఆర్ పోసిరెడ్డి, మడిపల్లి, పెనికిలపాడు గ్రామస్తులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.