
*రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ అధికారి ఎం.సత్యదేవి సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు కూటమి నాయకులు ఆధ్వర్యంలో యూరియా పంపిణీ*
ప్రజావాణి ప్రతినిధి దేవిపట్నం సెప్టెంబర్ 9
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో రైతులుకు మంగళవారం. సొసైటీ అధ్యక్షులు మాగాపు బాబురావు. ఎస్సీ సెల్ అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు. ఎరువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా. మండల వ్యవసాయ అధికారి ఎం. సత్య దేవి మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ మొదలైన సందర్భంగా రైతులకు యూరియా అందుబాటులోకి రావడం చాలా శుభ పరిణామం అని ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని అదేవిధంగా. ఎకరానికి 25 కేజీలు వాడాలని రోజు రోజుకు రసాయన ఎరువులు తగ్గి ఉంచాలని సేంద్రియ ఎరువుల వైపు వెళ్లాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పోలీస్ సిబ్బంది సచివాలయ సిబ్బంది రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.