
*ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలలో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు*
నస్రుల్లాబాద్ సెప్టెంబర్ 9 (మన ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల పరిధిలో దుర్కి గ్రామం ఎస్ ఆర్ ఎన్ కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కాళోజి నారాయణరావుకు జయంతి వేడుకలు జరుపుకున్నారు. మంగళవారము ఎస్ ఆర్ ఎన్ కె ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో. కాలాన్ని ఆయుధంగా మార్చుకొని తన కవితం రచనల ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించిన మహనీయుడు ప్రజా కవి కాళోజి నారాయణరావు తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఐ గంగాధర్ మాట్లాడుతూ సమ సమాజ నిర్మానికి కాళోజి బాటలు వేశారని ఆయన జయంతిని తెలంగాణ భాష దినోత్సవం జరుపుకోవడం రాష్ట్రానికి గర్వ కారణమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఊపిరిగా జీవించిన ప్రజా కవి తెలుగు భాష ప్రజల అవసరాల కోసం కాళోజి నియంతరం కృషి చేశారని తన కవితలు, రచనల ద్వారా, ప్రజలు, స్ఫూర్తి నింపారని, గుర్తు చేశారు. పుట్టక నీది చావు నీది, బతుకంతా దేశానిది, అని నినాదించిన కాళోజి జీవితం మొత్తం తెలంగాణ భాష సాహిత్య సేవకు అంకితం చేయడమే కాకుండా విపక్ష ఎక్కడ ఉన్న వ్యతిరేకరించి. అన్యాయాలపై ద్రిక్కారసరం వినిపించారని తెలిపారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగ దీపతి గోపాల్, ఐ క్యు ఎ సి కోఆర్డినేటర్ వినయ్ కుమార్, ఎన్. సి సి అధికారి కృష్ణ, ప్రోగ్రాం అధికారి పి శ్రీనివాస్,, డాక్టర్ రాజేష్, అనిత, శంకరావు, బట్టు, విట్టల్, శేఖర్, సుధాకర్ రెడ్డి, వినోషన్, మనోజ్, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,