ఆర్టీసీనీ వదలని నకిలీ జర్నలిస్టులు.. విలేకరి బస్‌ పాస్‌ ఫోర్జరీ

Ramesh

Ramesh

District Chief Reporter

జర్నలిస్టుల ముసుగులో నకిలీలు చెలరేగిపోతున్నారు. ఇప్పటి వరకు పీడీఎస్‌ బియ్యం లారీలను ఆపి దౌర్జన్యంగా సొమ్ములు వసూలు చేసుకుంటూ పోలీసులకు పట్టుబడిన నకిలీలను చూశాం. తాజాగా ఏకంగా ఆర్టీసీనే బోల్తా కొట్టించే యత్నం చేస్తున్న నకిలీల లీలలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత కొంతకాలంగా జర్నలిస్టుల పేరుతో చెలామణి అవుతూ కొందరు వ్యక్తులు అధికారులు, ప్రజాప్రతినిధులను, చిరు వ్యాపారులను టార్గెట్‌ చేస్తూ వచ్చారు. కాలక్రమంలో కొందరిపై పోలీసులు నిఘా ఉంచి అరెస్ట్‌ చేసిన ఘటనలూ జరిగాయి. బెల్టు షాపుల్లో వ్యాపారులను భయపెట్టి తప్పతాగడంతో పాటు అధికారులను, అంగన్వాడీ టీచర్లను , సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని సిబ్బందిని వేధిస్తూ వచ్చారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలో షేక్ మదీనా బాషా అనే వ్యక్తి బస్సు ఎక్కి, జర్నలిస్టు పాస్‌ను కండక్టర్‌కు చూపించాడు. అదే సమయంలో ఆర్టీసీ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీ చేస్తుండగా అతని పాస్‌ నకిలీదని తేలింది. ఇది కొయ్యలగూడెం – దొండపూడి బస్సులో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో జర్నలిస్టు సంఘాలు స్పందించాయి. నకిలీలు ఇటీవలి కాలంగా చెలరేగిపోతున్నారని, అసలు జర్నలిస్టుల మనుగడకు ఈ నకిలీలతో ప్రమాదం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశాయి. ఎవరైనా జర్నలిస్టుల పేరిట బెదిరింపులకు, మోసాలకు దిగినా అప్రమత్తంగా ఉండాలని సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

.మత్స్య పారిశ్రామిక సంఘానికి అందిన నోటీసులు….! పత్తాలేని అధ్యక్ష కార్యదర్శులు..? కోపరేటివ్ చట్టం ప్రకారం అధ్యక్ష కార్యదర్శులపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం…? చేసిన పాపం.. అవినీతిని కాపాడుకునేందుకు అధ్యక్షుడు కీలక చర్చలు పట్టించుకోని మత్స్యకారులు..? చేసేదేమీ లేదు అంటూ చేతులెత్తేసిన అధికార యంత్రాంగం…? మన ప్రజావాణి వార్తా కథనాలకు అధికారుల విలవిల..!!

 నోటిఫికేషన్స్