ముందే హెచ్చరించిన మన ప్రజావాణి వరుస కథనాలు…? వ్యవసాయ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే కదా…?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ముందే హెచ్చరించిన మన ప్రజావాణి వరుస కథనాలు…?

వ్యవసాయ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే కదా…?

ఒకవైపు కార్పొరేట్ కంపెనీలు… మరోవైపు ప్రవేటు వ్యాపారులు

జిల్లాలో మొక్కజొన్నల కొనుగోళ్లపై పట్టించుకోని అధికారులు

70 లక్షల రూపాయల మొక్కజొన్నలు కొనుగోలు చేసి వ్యాపారి పరారీ…?

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

ఖమ్మం జిల్లాలో కొ ణిజర్ల రఘునాథపాలెం ఏన్కూర్ జూలూరుపాడు తల్లాడ వైరా మండలాలలో ప్రతి సీజన్లో ప్రైవేట్ వ్యాపారులు కార్పొరేట్ మొక్కజొన్నల విత్తనాల కంపెనీలు రైతుల నుండి మొక్కజొన్నలను కొనుగోలు చేస్తారు. మద్దతు ధర కంటే అధికంగా చెల్లిస్తామని మాటలు చెప్పి ఎటువంటి గ్యారెంటీ హామీలు లేకుండా కోట్లాది రూపాయల వ్యాపారం జోరుగా నిర్వహిస్తారు. కొన్ని కార్పొరేట్ మొక్కజొన్న విత్తనాల కంపెనీలు దళారులు ఏజెంట్లు సహాయంతో ఆయా మండలంలోని రైతులను కలిసి కోట్లాది రూపాయల విలువ చేసే మొక్కజొన్నలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కొనుగోళ్లలో దళారులు బ్రోకర్లు ఏజెంట్లు దే కీలక పాత్రగా ఈ వ్యవహారం అంతా సుమారు 45 రోజులు వరకు కొనసాగుతోంది. కార్పొరేట్ బహుళ జాతి కంపెనీలు ఎటువంటి హామీలు లేకుండా ప్రతి సీజన్లో కొనుగోలు జరుపుతూ ఉంటారు. ఈ వ్యవహారంపై మన ప్రజావాణి తెలుగు దినపత్రిక వరుస కథనాలను ప్రచురించిన సంగతి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగానికి తెలిసిందే. ఎటువంటి ప్రభుత్వ గుర్తింపులు లేకుండా ప్రైవేటు వ్యాపారులు కోట్లాది రూపాయల మొక్కజొన్నల కొనుగోలు చేస్తున్న సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకున్న పాపాన పోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మండల స్థాయిలోని వ్యవసాయ అధికారులు ఏఈఓ లకు ఈ వ్యవహారం అంతా తెలిసినప్పటికీ పెద్దగా పట్టించుకోరని అందువల్ల ప్రతి ఏడాది సీజన్లలో ప్రైవేటు వ్యాపారులు కార్పొరేట్ కంపెనీలు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తాయని పలువురు రైతులు స్థానికులు అంటున్నారు.

రైతులకు 70 లక్షల రూపాయల మేర ఎగ్గొట్టిన ఓ ఏజెంట్

కొణిజర్ల రఘునాథపాలెం ఏన్కూర్ జూలూరుపాడు మండలాలకు చెందిన కొందరు రైతులు ఓ ప్రైవేటు ఏజెంట్ కు మొక్కజొన్నలను విక్రయించినట్లు సదరు ఏజెంటు 25 రోజుల నుండి నమ్మించి కుటుంబంతో సహా గుట్టు చప్పుడు కాకుండా పరారైనట్లు రైతులు లబోదిబోమంటున్నారు. సుమారు 70 లక్షల రూపాయల మేర రైతులు మొక్కజొన్నలను విక్రయించినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి మోసం చేసిన ఏజెంట్ పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share