
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-20ని స్పేస్ ఎక్స్ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది.స్పెస్ ఎక్స్ కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ జీశాట్-20న నింగిలోకి మోసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా నిర్వహించిన ఈ ప్రయోగం దిగ్విజయంగా ముగిసింది.ఈ ప్రయోగ విజయంతో భారత, అమెరికా అంతరిక్ష సంబంధాల్లో కొత్త శకానికి దారితీసినట్లయింది. 14 ఏళ్ల పాటు సేవలిందించనున్న జీశాట్-20 ఉపగ్రహం దేశంలోని మారు మూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలను అందించనుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు.
నిరంతరం మేధోమథనం చేస్తూ అంతరిక్ష రంగంలో సవాళ్ళను సాంకేతికంగా అధికమిస్తు ఆకాశమే హద్దుగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆకుంఠిత దీక్షతో ఖచ్చితత్వంతో నియమిత వ్యయంతో పరిమితులను అధిగమించి. పరిణితితో విజయాలకు మరో చిరునామాగా ఆంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో దూసుకుపోతున్న భారత్ మరో కీలక లక్ష్యం దిశగా సాగుతోంది. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అత్యంత అధునాతన ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఎలోన్ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్‌తో చేతులు కలిపింది. ఇస్రో అభివృద్ధి చేసిన జీశాట్-20 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి స్పేస్‌ఎక్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది రెండు సంస్థల మధ్య మొదటి వాణిజ్య సహకారం.