స్పామ్ మెయిల్స్‌ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ నుంచి త్వరలో మరో కొత్త ఫీచర్..!

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్(Google) తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్(New Features)ను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా స్పామ్ మెయిల్స్(Spam Mails)కు చెక్ పెట్టేందుకు గూగుల్ మరో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. షీల్డ్ ఈ మెయిల్(Shield E-mail) పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌ సాయంతో యూజర్లు తాత్కాలికంగా ఒక మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ షీల్డ్ ఈ-మెయిల్‌ ఐడీతో వినియోగదారులు ఏదైనా యాప్(App), అకౌంట్‌(Account)కి లాగిన్ కావచ్చు. అయితే ఈ-మెయిల్ ఐడీ కేవలం పది నిమిషాలు మాత్రమే పని చేస్తుందని తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ అవసరం అనుకుంటే యూజర్లు కొత్త షీల్డ్ ఈమెయిల్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఈ మెయిల్స్ యూజర్లు స్పామ్ మెయిల్స్‌ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ గురించి గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ఓ సృష్టత రానుంది. ఇదిలా ఉంటే ఈ తరహా ఫీచర్‌ను టెక్ దిగ్గజం యాపిల్(Apple) తన యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. హైడ్ మై ఈ-మెయిల్‌(Hide My E-mail) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ సాయంతో తాత్కాలిక మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని యాప్ లో లాగిన్ కావచ్చు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్