కాంగ్రెస్ నాయకుల వేధింపులు..మహిళా పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

కాంగ్రెస్ నాయకుల వేధింపులు..మహిళా పంచాయతీ కార్యదర్శి మిస్సింగ్

తాము చెప్పిన వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని దూషించిన కాంగ్రెస్ నాయకులు

“అమ్మా నాన్న నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న, ఈ కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేపకోతున్న” అంటూ లేఖ రాసి అదృశ్యమైన మహిళా పంచాయతీ కార్యదర్శి ప్రియాంక

డీపీఓకు వాట్సప్ ద్వారా రాజీనామా లేఖను పంపి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రియాంక

వేములవాడ అర్బన్ మండలం చింతలఠాణాకు చెందిన ప్రియాంక, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుంది

బద్దెనపల్లి గ్రామానికి చెందిన నలుగురు కాంగ్రెస్ నాయకులు తనను వేధిస్తున్నారని, ఇంకుడు గుంతల విషయంలో జీపీ కార్యాలయంలో అందరిముందే తనను తీవ్రంగా దూషించారని ప్రియాంక తన లేఖలో పేర్కొంది

ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తాము చెప్పినవారినే ఎంపిక చేయాలని కాంగ్రెస్ నాయకులు బెదిరించారని జీపీ కార్యాలయ సిబ్బంది వెల్లడించారు

అయితే సోమవారం ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితా అందజేయాల్సి ఉండగా, ప్రియాంక తన రాజీనామా లేఖను డీపీఓకు వాట్సప్ ద్వారా పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళింది

కుటుంబసభ్యులు సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు ప్రియాంక డైరీ, ఆమె రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు

ప్రియాంక ఫోన్ ట్రేస్ చేయడంతో ఆమె తిరుపతిలో ఉన్నట్టు గుర్తించారు, దీంతో కుటుంబసభ్యులు ఆమెకోసం తిరుపతి బయలుదేరారు

తన కూతురుని వేధించడం ఆపమని కాంగ్రెస్ నాయకులను ఎంత వేడుకున్నా వినలేదని ప్రియాంక తండ్రి రాజేశం ఆవేదన వ్యక్తం చేశాడు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్