నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై పోలీసు, వ్యవసాయ శాఖ అధికారుల సంయుక్తంగా దాడులు

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై పోలీసు, వ్యవసాయ శాఖ అధికారుల సంయుక్తంగా దాడులు

మూడు వేర్వేరు కేసుల్లో 14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు పట్టివేత

తొమ్మిది మంది అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు కొనసాగుతున్న విచారణ

నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ ఫోర్స్ బృందాలు

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

కుటీర పరిశ్రమలాగా నకిలీ ప్రత్తి విత్తనములు తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడి మూడు వేర్వేరు కేసుల్లో 14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు పట్టుకున్నారని, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు విచారణ కొనసాగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ … ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా పకడ్బంది చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీల విత్తనాల పేరుతో నాసి రకం, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ముఖ్యంగా .రైతులు సైతం విత్తనాలు కొనుగోలు సమయంలో అప్రమత్తత పాటించాలని, తక్కువ ధరలకు తెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి మోసపోవద్దని అన్నారు.

కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి, తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి రైతులను మోసం చేస్తారని, ఇటువంటి వారిపై గ్రామాల్లో సైతం నిఘా పెట్టామని తెలిపారు.

నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే మండల వ్యవసాయ శాఖ అధికారికి గాని స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
మార్కెట్ లో నకిలీ విత్తనాల విక్రయం జరుగకుండా టాస్క్ ఫోర్స్ బృందాల నిరంతరం పర్యవేక్షణ వుంటుందని తెలిపారు.

కేసు వివరాలు…

28.05.2025 న ఉదయం ఏన్కూర్ పోలీస్ వ్యవసాయ అధికారుల ఉమ్మడి తనిఖీలలో భాగంగా ఏనుకూరు గ్రామానికి చెందిన గాజుల నరసింహారావు వయసు 49 సంవత్సరాలు అనే వ్యక్తి కొద్దిమంది రైతులకు అనుమతిలేని పత్తి విత్తనాలను అమ్ముతున్నాడని సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా అతని వద్ద 450 గ్రాములు బరువు గల అడ్వాన్స్ 555 పేర్లతో ఉమ్మడి పత్తి విత్తనాల ప్యాకెట్లు దొరకగా సీజ్ చేయడం జరిగింది. ఎస్సై కల్లూరు ని డి హరిత కల్లూరు గారితో ఒక టీం ఏర్పాటు చేసి తదుపరి విచారణ చేయగా ఇట్టి పత్తి విత్తనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మైలవరం మండలానికి చెందిన చంద్రు గూడెం గ్రామానికి చెందిన శాలివాహన అనే వ్యక్తి వద్ద నుండి కిలో 450 గ్రాముల ప్యాకెట్లను 400 రూపాయలకు కొనుక్కొచ్చి ఇక్కడ 1,200 రూపాయలకు అమ్ముతున్నాడని విచారణలో వెలుగులోనికి వచ్చింది. ఇట్టి విషయం పైన సిపి ఖమ్మం ఆదేశం ప్రకారం డి హరిత ఎస్సై కల్లూరు ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి మైలవరం మండలం చంద్రు గూడెం గ్రామానికి చెందిన శాలివాహన సన్నాఫ్ ఎల్లయ్య ఆర్.ఓ చంద్రు గూడెం ఇంటి వద్ద ఒక కుటీర పరిశ్రమలాగా నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. అతను కర్ణాటక నుండి ప్రతి విత్తనాలు మరియు వాటిని ట్యాగ్ చేయడానికి ప్రింటెడ్ అడ్వాన్స్ త్రిబుల్ ఫై నెంబర్ గల కవర్తో ఉన్న ప్యాకెట్స్ తో తీసుకొచ్చి తన ఇట్టిపతి విత్తనాలను రైజోబెల్ మిశ్రమాన్ని కలిపి ఆరబెట్టి ఇట్టిపత్తి విత్తనాలను ప్యాకెట్లలో నింపి సీల్ చేసి గాజుల నరసింహారావు మరి కొంతమంది ఏజెంట్లు ద్వారా రైతులకు అధిక దిగుబడి వస్తుందని అలాగే కలుపమందు వలన ఇబ్బంది ఉండదని నమ్మించి ఒక్కొక్క ప్యాకెట్ 1,200 రూపాయలకు రైతులకు అమ్ముతున్నాడని తెలిసింది. అతని ఇంటి వద్ద నుండి ఒక క్వింటా రైజోబెల్ మిశ్రమం కలిపి పెట్టి ప్యాక్ చేయన్ని పత్తి విత్తనాలు, 450గ్రాములు బరువు కలిగి అరుణోదయ లేబల్ తో ఉన్న (272) పత్తి విత్తన ప్యాకెట్లను అలాగే ప్యాకెట్ సీల్ చేయడానికి వాడే (2) మిషన్లు, ఒక వేయింగ్ మిషన్, ప్రత్తి విత్తనములు పక్క చేయుటకు అరుణోదయ లేబల్ తో ఉన్న సుమారు (400) ఖాళీ పాక్కెట్లు మరియు రెండు లీటర్ల రైజోబెన్ మిశ్రమమును సీజ్ చేయడం జరిగింది.

మరో కేసులో తేదీ 27.05.2025 ఉదయం ఏన్కూరు పోలీస్ మరియు మండల వ్యవసాయ అధికారులు సంయుక్తంగా రేపల్లెవాడ గ్రామ శివారున నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం మేరకు వెనిగండ్ల శ్రీహర్రావు అనే వ్యక్తి యొక్క వ్యవసాయ భూమిలో తనిఖీలు నిర్వహించగా అక్కడ (210) ఒక కేజీ ప్యాకెట్లలో ఉన్న నకిలీ పత్తి విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగినది. తదుపరి వెనిగండ్ల శ్రీధర్ రావు ఇచ్చిన సమాచారం మేరకు అతని అనుచరుడైన ఇమ్మినేని కిషోర్ ఏన్కూర్ ఇంటి వద్ద తనిఖీ చేయగా సుమారు 120 కిలోల పత్తి విత్తనాలు లభించినాయి. అలాగే పత్తి విత్తనాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్న రైజోబిన్ కెమికల్ మరియు వేయింగ్ మిషన్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వెనిగండ్ల శ్రీహర్రావు గత కొంతకాలంగా బాపట్ల జిల్లాలో ఉన్న తన బంధువైన లక్ష్మీనారాయణ ద్వారా కిలో 800/- రూపాయాలకి నకిలీ మరియు ఎటువంటి అనుమతి లేని విత్తనాలు తెప్పిస్తూ ఏనుకూరు మండల రైతులకు అధిక దిగుబడి వస్తున్న వంగడాలని నమ్మించి కిలో రూ 2,600/- రూపాయలకు అమ్ముచు లాభాలు గడిస్తున్నాడని విచారణలో తెలిసినది.

అదేవిధంగా శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఎస్సై ఏన్కూరు కి వచ్చిన సమాచారం మేరకు ఏన్కూరు గ్రామంలో పోలేటి కోటేశ్వరరావు ఇంటి వద్ద తనిఖీ చేయగా అతని వద్ద నకిలీ ప్రతి విత్తనాల ప్యాకెట్ (20) ప్యాకెట్లు లభ్యమైనది. అతనిని విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలి జిల్లా నుండి తీసుకొచ్చి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రత్తి విత్తనాలను అమ్ముతున్నాడని తెలిసింది. ఈ మేరకు పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి మూడు వేరు వేరు కేసుల్లో 14 లక్షల విలువచేసే 560 కేజీల నకిలీ విత్తనాలను పట్టుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మీడియా సమావేశం లో కల్లూరు ఏసీపీ రఘు, సత్తుపల్లి రూరల్ సిఐ ముత్తులింగం, ఎస్సై రఫి, ఎస్సై హరిత పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share